Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టబోయే బిడ్డకు అందంగా కనిపించాలని తపనపడిన మహిళ

పుర్రెకోబుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. అందుకే, పురిటి నొప్పులతో బాధ పడే ఏ మహిళా ఆలోచించని విధంగా ఆలోచించిన ఓ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన అలాహా మాజిద్ అనే మహిళ స్వతహాగా మేకప్ ఆర్టిస్ట్. నిండుచూలాలైన అలాహాకు ప్రసవ సమయం వచ్చింది. ఆ సమయంలో పుట్టబోయే తన బిడ్డకు అందంగా కనిపించాలని భావించిన అలాహా నొప్పులు వస్తున్నా మేకప్ వేసుకోవడం మాత్రం మరువలేదు. అలా ఆమె మేకప్ వేసుకునేందుకు ఆమె భర్త కూడా సహకరించడం మరో విశేషం. ఆమె కోరుకున్నట్టు ఆమె బిడ్డ ఆమె అందాన్ని చూసిందో లేదో తెలియదు కానీ, ఆమె మేకప్ చేసుకుంటుండగా తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అవి సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. నొప్పులు వస్తున్నా మేకప్ వేసుకుంటున్న విధానాన్ని 'ఇదేమి చోద్యం' అంటూ అంతా ఆశ్చర్యంగా షేర్ చేసుకుంటున్నారు.

More Telugu News